పెళ్లికి ముందే సహజీవనం చేసిన స్టార్ సెలబ్రిటీస్ వెళ్లే ..!!

-

సహజీవనం.. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ విధానం ఎప్పుడు కూడా మన భారతదేశంలో లేదనే చెప్పాలి.. కానీ పాశ్చాత్య దేశాల్లో ఎప్పుడైతే లివింగ్ రిలేషన్ పేరిట చాలామంది పెళ్ళికి ముందే సహాజీవనం చేస్తూ భార్యాభర్తలుగా జీవిస్తున్నారో.. ఇక అప్పటినుంచి ఆ పద్ధతికి అలవాటు పడిపోయిన మన భారతదేశ వాసీలు కూడా సహజీవనం పేరిట డేటింగ్ చేస్తూ పెళ్లికి ముందే తల్లులు కూడా అవుతున్నారు. ఇక తర్వాత వారిని వివాహం చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఒకవేళ వివాహం చేసుకున్నా కొద్ది నెలలకే విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇకపోతే సహజీవనం పేరిట ఎంతమంది స్టార్ట్ హీరోలు ఇలా రిలేషన్షిప్ మైంటైన్ చేశారో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్:
సహజీవనానికి బెస్ట్ సెలబ్రిటీ ఎగ్జాంపుల్ ఈ జంట అని చెప్పవచ్చు. వివాహానికి ముందే సహజీవనం చేసి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ సమక్షంలోనే వివాహం చేసుకున్నారు ఇక కొన్నాళ్లకు విడాకులు తీసుకొని ఎవరి జీవితం వారు చూసుకోవడం జరిగింది.

నాగచైతన్య – సమంత :
కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించినా ప్రేమలో ఉన్నప్పుడు వీళ్లిద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. ఇక అలా సహజీవనం సాగించినట్లు అప్పట్లో రూమర్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు విడాకులు తీసుకొని అందరికీ మరొకసారి ఆశ్చర్యాన్ని కలిగించడం గమనార్హం.

శ్రీదేవి – బోనీ కపూర్:
వీరిద్దరూ కూడా పెళ్లికి ముందే సహజీవనం చేసి జాన్వి కపూర్ కు జన్మనిచ్చిన తర్వాత వివాహం చేసుకున్నారు. అయితే అంతకుముందే బోనీ కపూర్ కి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అమీర్ ఖాన్ -కిరణ్ రావు:
ఈ జంట కూడా వివాహానికి ముందు ఏడాదిన్నర పాటు సహజీవనం చేశారు. ఇక తర్వాత వివాహం చేసుకోని..ఇటీవల విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది.

సైఫ్ అలీ ఖాన్ – కరీనాకపూర్:
వీరు కూడా వివాహానికి ముందు కొన్ని సంవత్సరాలు పాటు సహజీవనం సాగించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంట ప్రస్తుతం ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.

విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ:ఇక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇద్దరు కూడా సహజీవనం చేశారు .ఆ తర్వాత వివాహం చేసుకోవడం జరిగింది.

ఇక ఇలా వీరితో పాటు మరి ఎంతో మంది సహజీవనం చేసి ఆ తర్వాత వివాహం చేసుకోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version