ఇప్పటి ట్రెండ్ అంతా సోషల్ మీడియాలోనే ముందుగా వస్తుంది. ఏ కొత్త విషయమైనా సరే అందులో ఉండాల్సిందే. ఇక ఫాలోయింగ్ పెంచడంలో సోషల్ మీడియాది ప్రత్యేక స్థానం. మరీ ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్లకు ఇది ఉండాల్సిందే. లేకపోతే వారి అభిమానులకు వారు దూరమయినట్టే అని చెప్పాలి. అలాంటి సోషల్ మీడియాకు ఒక పెద్ద డైరెక్టర్ గుడ్‌బై చెప్పారు. ఆయనెవరో కాదు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ.
కొరటాల శివ ఇప్పటి వరకు తన సినిమాల గురించి అప్‌డేట్లను సోషల్ మీడియా వేదికగా తెలియజేసేవారు. తన సినిమా అభిమానులు అందరూ దాన్నే ఫాలోఅయ్యేవారు. ఆయనకు ట్విట్టర్ లో దాదాపు 1.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నా కూడా ఆయన వాటన్నింటికీ గుడ్ బై చెప్పేశారు. అయితే ఉన్నట్లుండే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. తాను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు ప్రకటించారు. అలాగే ఇకపై తాను నేరుగా తన పనులపై దృష్టిపెట్టాలని అనుకుంటున్నట్టు తెలిపారు. మీడియా స్నేహితుల ద్వారా తాను అభిమానులతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రరకటించారు. కొరటాల పూర్తిగా తన సినిమాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్ఉ ఆయన అభిమానులు భావిస్తున్నారు.