పాలిటిక్స్ కి దూరం అంటున్న స్టార్ హీరోయిన్..!

-

కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని కూడా ఆగిపోయిన సంగతి అందరికి విదితమే. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన అనంతరం చిత్ర పరిశ్రమలో సినిమా షూటింగ్ మొదల పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ షూటింగ్స్ లో పాల్గొంటుంది. శృతిహాసన్ నటిస్తున్న క్రాక్ సినిమా ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ కొనసాగుతుంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్, లాభం సినిమాలలో కీలక పాత్ర పోషిస్తుంది.

తాజాగా శృతి హాసన్ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా. అందులో తన వృత్తి పరమైన, వ్యక్తిగత అంశాలపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. శృతిహాసన్ కొన్ని రోజులు తన పెళ్లి ప్రస్తావన కు సంబంధించి చాలా దూరంగా ఉంటానని తెలిపింది.. అలాగే ఇంటర్వ్యూయర్ తండ్రి కమల్ హాసన్ పెట్టిన పార్టీ లో ఏమైనా అడుగు పెడతారా..? అని ప్రశ్నించగా అందుకు సమాధానంగా శృతిహాసన్ స్పందిస్తూ తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని, వచ్చే ఎన్నికల్లో కనీసం తండ్రి పార్టీ కోసం ప్రచారం కూడా చేయనని శృతి హాసన్ సమాధానం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version