వినియోగదారులకు స్టేట్ బ్యాంకు వార్నింగ్… మీ ఛార్జర్ మీరే తీసుకువెళ్ళండి…!

-

ఈ రోజుల్లో నగదు లావాదేవీలను చేసే వారిని ఎక్కువగా వెంటాడుతున్న భయం హ్యాకింగ్. ఆన్లైన్ వాడకం ఎక్కువగా పెరిగిపోవడంతో వినియోగదారులకు హ్యాకర్లు చుక్కలు చూపిస్తున్నారు. భారీగా హ్యాకింగ్ కి పాల్పడుతూ నగదు దోచేస్తున్నారు… ఈ మధ్య భారత్ లో ఇది ఎక్కువైంది… దీనితో వినియోగదారులు ఆన్లైన్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ వాడకం ఎక్కువగా పెరిగింది. మొబైల్ లోనే ఎక్కువగా నగదు నిర్వహణ అనేది జరుగుతుంది. చాలా లావాదేవీలను దాని ద్వారానే చేస్తున్నారు.

ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వినియోగదారులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏదోక రూపంలో హ్యాకింగ్ దెబ్బకు భారీగా డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తన వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారి చేసింది. పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టేటప్పుడు అప్రమత్తంగా తమ వినియోగదారులను హెచ్చరించింది. హ్యాకర్లు మాల్వేర్ సాయంతో మీ ఫోన్‌‌లోని డేటా హ్యాక్ చేయవచ్చని ఒక ప్రకటనలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పేర్కొంది.

దీని ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. మొబైల్ చార్జింగ్ స్టేషన్స్ ద్వారా మోసాలు జరిగే విధానాన్ని తెలిపింది. చార్జింగ్ స్టేషన్స్‌లో ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని చెప్పింది. మీ ఫోన్‌పై మాల్వేర్ దాడి చేయొచ్చని చెప్పింది. దీంతో హ్యాకర్లు మీ ఫోన్ డేటాను దొంగతనం చేసే ప్రమాదముందని హెచ్చరించింది. జ్యూస్ జాకింగ్ ద్వారా మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం లేదా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర కంప్యూటర్ పరికరం నుంచి విలువైన సమాచారం కాపీ చేసే అవకాశం ఉందని కాబట్టి సొంత‌ ఛార్జింగ్ కేబుళ్లను తీసుకెళ్లమని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version