రైల్వే ప్రయాణీకులకు బిగ్ షాక్ తగిలింది. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ పలు మార్గాల్లో తిరిగే డెమో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిర్వహణా పనులు, భద్రత కారణంగా 13 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే సంస్థ తాజాగా వెల్లడించింది. సికింద్రాబాద్ మేడ్చల్ సికింద్రాబాద్ డెము ప్యాసింజర్, ఫలక్ నుమా మేడ్చల్ ఫలక్‌నుమా డెము ప్యాసింజర్ , ఫలక్ నుమా ఉమ్దా నగర్ ఫలక్ నుమా డెము ప్యాసింజర్ , బొల్లారం ఫలక్ నుమా బొల్లారం డెము ప్యాసింజర్ రద్దయిన రైళ్ల జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు ఫలక్ నుమా మనోహరాబాద్ సికింద్రాబాద్ డెము ప్యాసింజర్ , సికింద్రాబాద్ ఉమ్దా నగర్ డెము ప్యాసింజర్ , ఉమ్దా నగర్ ఫలక్ నుమా ఉమ్దా నగర్ డెము ప్యాసింజర్, ఫలక్ నుమా భువనగరి ఫలక్ నుమా ప్యాసింజర్ రైళ్లు కూడా ఆరు నెలల పాటు రద్దు చేశారు.అలాగే తదితర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే సంస్థ ప్రత్యామ్యాయాల్ని విస్మరించింది. ఈ క్రమంలోనే ప్రయణికులు కొన్ని నెలల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది.