ఏపీలోని గుంటూరు జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు రాళ్లతో కొట్టిచంపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన హత్య వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.దీంతో ఆ హత్య కేసు మిస్టరీగా మారింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వీడియో తీసిన వ్యక్తిని గుర్తించి అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యక్తి దూరంగా ఉండి వీడియో తీసినట్లు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది.