BREAKING : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్ టెల్ సేవలు..

-

ఇండియా వ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన ఎయిర్ టెల్ సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయం నుంచి.. బ్రాడ్ బాండ్, వైఫై అలాగే మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. అన్ని సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. మరోవైపు ఎయిర్టెల్ యాప్ కూడా పనిచేయడం లేదు. దీంతో ఎయిర్టెల్ కస్టమర్ లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మా నెట్వర్క్ పని చేయడం లేదంటూ సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో… ఎయిర్టెల్ డౌన్ అనే హాష్ టాగ్ కూడా ట్రెండింగ్ అవుతోంది.ఈ తరుణంలో స్వయంగా ఎయిర్టెల్ సంస్థ ఈ సమస్య స్పందించింది. తమ కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. “మా ఇంటర్నెట్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది మరియు దీని వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము. మా కస్టమర్‌లకు అతుకులు లేని అనుభవాన్ని అందించడానికి మా బృందాలు పని చేస్తూనే ఉన్నందున, ఇప్పుడు అన్ని సేవలు నడుస్తాయి.” అంటూ ట్వీట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version