వలస కూలీలకు ఊరట.. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి

-

లాక్ డౌన్ కారణంగా వేరే రాష్ట్రాలు, జిల్లాల్లో చిక్కుపోయిన వలస కూలీలకు కేంద్రం ఊరట కల్పించింది. వలస కూలీలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులు, పర్యాటకులను వారి స్వస్థలాలకు తరలింపు ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇతర రాష్ట్రాలలోని వారు తమ స్వస్థలాలకు చేరుకోవాలనుకుంటే.. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పరం అంగీకారం కుదరాలని చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నోడల్‌ అధికారులను నియమించుకోవాలని సూచించింది. వారికి పరీక్షలు నిర్వహించిన అనంతరం.. కరోనా లక్షణాలు లేకుంటేనే ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది. స్వస్థలాకు చేరుకున్న తర్వాత వారికి అక్కడి స్థానిక అధికారులు మరోసారి పరీక్షలు చేయాలని తెలిపింది.

కొన్ని రాష్ట్రాలు కోరినట్టు ప్రత్యేక రైళ్లు నడపడానికి మాత్రం కేంద్రం నిరాకరించింది. కేవలం బస్సుల్లో మాత్రమే వారిని తరలించాలని చెప్పింది. అయితే ఆ బస్సులను కూడా శానిటైజ్ చేయాలని.. నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఈ తరలింపులో భౌతిక దూరం పాటించడంతో పాటు, మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. కాగా, దేశంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి వలస కార్మికులతో పాటుగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులు, పర్యాటకులు తమను స్వస్థలాకు పంపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో మే 3వ తేదీన రెండో దశ లాక్ డౌన్ ముగుస్తున్న కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news