సంతానం కోసం ఇలా కూడా చేస్తారా.. వింత ఆచారం..!

-

పెళ్లయి ఎన్నో ఏళ్ల అయినప్పటికీ సంతానం లేని వారికి సంతానం కోసం ఎన్నో పూజలు యాగాలు చేస్తూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్న విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని దేవాలయాలలో ఉండే వింత ఆచారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఇలాంటి ఆచారాలు కాస్త ప్రమాదకరం అయినప్పటికీ సంతానం కలుగుతుందేమో అని ఆశతో పాటిస్తూ ఉంటారు మహిళలు ఇక్కడ ఇలాంటి ఒక వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సంతానం కోసం పూజలు చేసే మహిళలందరూ వరుసగా రోడ్డుపై పడుకుని ఉంటే పూజలు వారిని తొక్కుకుంటూ వెళుతూ ఉంటారు ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది చతిస్గడ్ రాష్ట్రంలో.

దంతారీ జిల్లాలో ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. అయితే మహిళలు అందరూ అలా పూజారులతో తొక్కించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. కాగా దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో ఎంతో మంది నెటిజన్లు ఈ ఆచారాన్ని చూసి షాక్ అవుతున్నారు. అయితే ప్రతి ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా మాదారి జాతరలో ఈ కార్యక్రమం కొనసాగుతుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version