ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌కు వింత అనుభవం.. టాయిలెట్‌లో చిక్కుకుని..

-

ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెట‌ర్ నొకోలా కేరి కు వింత అనుభ‌వం ఎదురైంది. సోమవారం వెస్టిండీస్ తో జ‌రిగిన ఒక వార్మ‌ప్ మ్యాచ్ కు ముందు ఆసీస్ క్రికెటర్ నొకోలా కేరి టాయిలెట్ కు వెళ్లింది. కాగ అక్క‌డ డోర్ స్ట్ర‌క్ కావ‌డంతో.. కేరి దాదాపు 20 నిమిషాల పాటు.. టాయిలెట్ లోనే ఉండాల్సి వ‌చ్చింది. మ్యాచ్ స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్నా.. కేరీ రాక‌పోవ‌డంతో జ‌ట్టు స‌భ్యులు, స‌హాయ‌క బృందం ఆందోళ‌న చెందారు. కాగ 20 నిమిషాల త‌ర్వాత నొకోలా కేరి ఎలాగో అలా.. టాయిలేట్ నుంచి బ‌య‌ట ప‌డింది.

జ‌ట్టు స‌భ్యుల‌తో క‌లిసి త‌ర్వాత అస‌లు విషయాన్ని పంచుకుంది. దీంతో మైదానంలో ఉన్న వాళ్లు అంద‌రూ కూడా న‌వ్వారు. అయితే త‌న స‌మ‌స్య గురించి క్రికెట‌ర్ నొకోలా కేరి చెబుతున్న వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది. కాగ ఈ నెల 4 వ తేది నుంచి మ‌హిళల ప్ర‌పంచ క‌ప్.. న్యూజిలాండ్ వేదిక‌గా జ‌ర‌గ‌బోతుంది. ఇప్ప‌టికే దాదాపు అన్ని జ‌ట్లు కూడా న్యూజిలాండ్ కు చేరుకున్నాయి. అలాగే వార్మ‌ప్ మ్యాచ్ లు కూడా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ సోమ‌వారం వెస్టిండీస్ జ‌ట్టుతో ఆస్ట్రేలియా త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ మ‌ధ్య‌లోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Read more RELATED
Recommended to you

Latest news