యూరియా కోసం లైన్ లో పుల్లలు, చెప్పులు, గిన్నెలు, డబ్బాలు, ఇటుక పెళ్లలు

-

యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం పుల్లలు, చెప్పులు, గిన్నెలు, పెయింట్ డబ్బాలు, ఇటుక పెళ్లలు లైన్లో పెట్టారు రైతులు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్‌లో యూరియా కోసం రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు రైతన్నలు.

Straws, sandals, bowls, cans, and brick pails in line for urea
Straws, sandals, bowls, cans, and brick pails in line for urea

నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం కొత్తపల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతుల కష్టాలను అడిగి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పీఏసీఎస్ యూరియా గోదాంలో వేలిముద్ర పడకపోవడంతో యూరియా సరఫరాను నిలిపివేశారు అధికారులు. తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news