మీరు ఎప్పుడైనా గమనించారా ఇష్టమైన చాక్లెట్ లేదా తీపి పదార్థాలు తిన్న తర్వాత ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితే వాటి రుచి ఒక్కసారిగా చేదుగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు అని మనం ఎన్నోసార్లు అనుకుంటా, నోటిలో ఉన్న తీపి రుచి ఒక్కసారిగా చేదుగా మారడానికి ఇది కేవలం ఒక అనుభవం మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? మన నాలుక మెదడు రుచి కి సంబంధించి ఈ విచిత్రమైన అనుభవానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తీపి తర్వాత చేదు ఈ వింత అనుభవానికి ప్రధాన కారణం మన నాలుగు పై ఉన్న రుచి మొగ్గలు. నాలుక ఉపరితలంపై ఉన్న ఈ రుచి మొగ్గలు మనం తినే ఆహార పదార్థాల రుచులను గ్రహించి మెదడుకు సంకేతాన్ని పంపుతాయి. రుచి మొగ్గలు ముఖ్యంగా ఐదు రకాల రుచులను గుర్తించగలవు తీపి చేదు, పులుపు, ఉప్పు,కారం.

మనం తీపి పదార్థాలు ముఖ్యంగా చాక్లెట్ లేదా స్వీట్స్ తిన్నప్పుడు మన నాలుకపై ఉన్న తీపి రుచి మొగ్గలు అతిగా ప్రేరేపించబడతాయి. ఈ అధిక ప్రేరణ వల్ల ఆ రుచి మొగ్గలు తాత్కాలికంగా తమ సున్నితత్వాన్ని కోల్పోతాయి ఇది శాస్త్రీయంగా ‘తాత్కాలికంగా రుచి అనుకూలత’ అని అంటారు మన మెదడు మరియు రుచి మొగ్గలు తీపి రుచికి అలవాటు పడిపోతాయి.
ఈ స్థితిలో మనం టీ లేదా కాఫీ తాగినప్పుడు అవి సహజంగానే కొంత చేదు రుచులు కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ చేదు రుచిని మన నాలుకలోని చేదు రుచి మొగ్గలు గ్రహిస్తాయి కానీ తీపి పదార్థం తినడం వల్ల అప్పటికే అధికంగా ప్రేరేపించబడిన తీపి రుచులు పనిచేయడం మానేస్తాయి. వాటి సున్నితత్వం బాగా తగ్గిపోతుంది దీనివల్ల మన నాలుకపై ఉన్న చేదు రుచులు గ్రహించే మొగ్గలు మరింత స్పష్టంగా మరియు తీవ్రంగా పనిచేస్తాయి. దీంతో టీ లేదా కాఫీలో ఉండే సహజమైన చేదు రుచి మరింత ఎక్కువ చేదుగా అనిపిస్తుంది.