ప్చ్.. నాలుగేళ్ల బాబు పై వీడి కుక్కల దాడి..!

-

మలక్ పేట లోని మూసారంభాగ్ లక్ష్మీ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది పాపం నాలుగేళ్ల బాబు మీద కుక్కలు అటాక్ చేశాయి. నాలుగేళ్ల బాలుడైన ఉజ్వల్ కుమార్ మీద కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఇంట్లో నుండి బయటకి రాకపోతే కుమారుడి ప్రాణాలు దక్కేవని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు తెలిపిన దాని ప్రకారం అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లి పేట గ్రామానికి చెందిన జంపన సాయికుమార్ అలేఖ్య దంపతులు కొడుకు ఉజ్వల్ కుమార్. 6 నెలల వయసున్న ఇంకో బాబు కూడా వీళ్ళకి ఉన్నాడు.

హైదరాబాద్ వచ్చేసారు కొన్నాళ్ల క్రితం. చిన్న కొడుకు నిద్ర లేచాడని ఇంట్లోకి వెళ్ళగానే ఉజ్వల్ మీదకి వీధి కుక్కల ఒక్కసారిగా వచ్చేసి దాడి చేశాయి బాలుడు గట్టిగా ఏడవడంతో తల్లి బయటికి వచ్చింది. ఆమె కొట్టింది కానీ అప్పటికే తీవ్ర గాయాలు పాలైపోయాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు చికిత్స చేసారు 10 కుట్లు వేశారని తండ్రి చెప్పారు ఇంటి నుండి బయటకు రాకపోతే కొడుకు ప్రాణం ఉండేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news