ఏపీలో జగన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆయన ఇమేజ్ మీద ఆధారపడే చాలామంది వైసీపీ నేతలు బండి లాగిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఎన్నికల సమయం కంటే ఈ రెండేళ్లలో జగన్ బలం బాగా పెరిగింది. ఆ విషయం పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలని చూస్తే అర్ధమైపోతుంది. కేవలం వన్ మ్యాన్ షో ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది.
వీరికి పార్టీ ఇమేజ్‌తో పాటు సొంత ఇమేజ్ కూడా కలిసిరావడంతో మొన్న ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. వీరు గెలిచిన పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు వైసీపీనే గెలిచింది. కానీ పార్లమెంట్ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరగడంతో ముగ్గురు ఎంపీలు గెలిచేశారు.
అయితే ఈ ముగ్గురు ఎంపీలకు జగన్ ఇప్పటికీ చెక్ పెట్టలేకపోతున్నారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నా సరే టీడీపీ ఎంపీలకు పెద్దగా నష్టం జరగలేదు. ఈ ముగ్గురు లోక్‌సభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీలకు ధీటుగా ఈ ముగ్గురు ఎంపీలు పనిచేస్తున్నారు.
ఇలా వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్న ముగ్గురు ఎంపీల బలం జగన్ తగ్గించలేకపోయారనే చెప్పొచ్చు. పైగా వీరిపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేతలు ప్రస్తుతం దూకుడుగా ఉండటం లేదు. శ్రీకాకుళంలో రామ్మోహన్ మీద దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే దువ్వాడని జగన్ టెక్కలి నియోజకవర్గానికి పంపించేశారు. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో రామ్మోహన్‌ని ఢీకొట్టే నాయకుడు లేరు.
అటు విజయవాడలో కేశినేనిపై ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్(పివిపి), ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లోనే కనిపించడం లేదు. గుంటూరులో గల్లా జయదేవ్‌పై ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సైతం వైసీపీలో దూకుడుగా ఉండటం లేదు. ఇలా టీడీపీ ఎంపీలకు పోటీగా వైసీపీ నేతలు లేకపోవడం, పైగా వారికి సొంత ఇమేజ్ ఉండటంతో జగన్ ముగ్గురు టీడీపీ ఎంపీలకు చెక్ పెట్టలేకపోతున్నారని చెప్పొచ్చు.