గత ప్రభుత్వం మీద పదేళ్లకు వ్యతిరేకత వస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ పాలన మీద ఏడాదికే వ్యతిరేకత మొదలైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.శనివారం నల్లగొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సరోత్తమ్ రెడ్డి గెలుపు కోరుతూ ప్రచారం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు సరోత్తమ్ రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డిలు పోటీలో ఉన్నారని.. వారిని ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని కేంద్రమంత్రి తెలిపారు. గతంలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించేవారని, ప్రస్తుతం ప్రభుత్వానికి సలామ్ కొడుతున్నారని విమర్శించారు.