ఇక సెలవు: విజయంతో కెరీర్ కు వీడ్కోలు పలికిన స్టువర్ట్ బ్రాడ్ … !

-

నిన్నటితో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ ముగిసింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్యన తేలిన ఫలితంతో ఆస్ట్రేలియా కంగుతింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభంలో విజయం కంగారూలదే అని అంతా అనుకున్న్నారు. ఎందుకంటే ఓపెనర్లు ఖవాజా మరియు వార్నర్ లు అద్భుతంగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు చేశారు. కానీ నిన్న ఆఖరి రోజున సీన్ అంతా మారిపోయింది. వార్నర్ , ఖవాజాలు అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ గాడి తప్పింది. కానీ స్టీవ్ స్మిత్ మరియయు హెడ్ లు కాసేపు ప్రతిఘటించారు. ఆ తర్వాత వర్షం దాదాపుగా రెండు గంటలకు పైగానే విసిగించింది. ఇక మ్యాచ్ డ్రా అని అంతా అనుకున్నారు. కానీ వర్షం ఆగడం… ఇంగ్లాండ్ బౌలర్లు మాయ చేయడం చకచకా జరిగిపోయాయి. దీనితో విజయానికి 50 పరుగుల ముందు ఆస్ట్రేలియా బొక్క బోర్లా పడింది. ఫలితంగా ఇంగ్లాండ్ మ్యాచ్ ను దక్కించుకుంది మరియు యాషెస్ సిరీస్ ను 2 – 2 తో సమం చేసుకుని పరువు దక్కించుకుంది.

ఇక ఈ టెస్ట్ తో తన ఇంటర్నేషనల్ కెరీర్ కు సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గౌరవంగా విజయంతో ముగింపు పలికాడు. కాగా ఆఖరిగా రెండు వికెట్లు (క్యారీ మరియు మర్ఫీ) తీసి జట్టుకు విజయాన్ని అందించి తన రిటైర్మెంట్ ను గుర్తుంచుకునేలా చేశాడు బ్రాడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version