ఎంసెట్ : ఏకంగా 904 ఆప్షన్స్ ఇచ్చుకున్న విద్యార్ధి !

ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఈరోజుతో వెబ్ ఆప్షన్స్ గడువు ముగియనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి 55, 783 విద్యార్థులు హాజరయ్యారు. 54, 017 విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. అయితే ఒక్క విద్యార్థి అత్యధికంగా 904 ఆప్షన్స్ ఇచ్చుకున్నట్టు పేర్కొన్నారు ఎంసెట్ అధికారులు.

ఇక 54, 017 విద్యార్థులు అందరూ కలిపి 24,17, 957 వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. ఇక ఈ నెల 24 న ఎంసెట్ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. https://tseamcet.nic.in వెబ్సైట్ లో సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడించనున్నారు. విద్యార్థులకు sms ద్వారా కూడా సమాచారం అందించనున్నారు. సీట్ అలాట్ అయిన వారు ఆన్లైన్ ద్వారా ట్యూషన్ ఫీ చెల్లించి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ నెల 24 నుండి 28 వరకు చేసుకునే అవకాశం కల్పించారు ఎంసెట్ అధికారులు.