డ్రైనేజ్ లో కేజీ బంగారం మిస్సయిన కేసులో కీలక ఆధారాలు !

ఈ నెల 9న బంగారు ఆభరణాలు స్కూటీపై తీసుకెళ్తుండగా నగలు మాయం అయిన కేసును బంజారాహిల్స్ పోలీసులు ఛేదించారు. బషీర్ బాగ్ వీఎస్ గోల్డ్ నగల దుకాణం నిర్వాహకుల నుండి జూబ్లీహిల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపులో ఓ కస్టమర్ కోసం అక్కడి ప్రదీప్ అనే సేల్స్ మెన్ ఆభరణాలు తీసుకొచ్చాడు.

వాటిని ద్విచక్రవాహనంపై తిరిగి వీఎస్ గోల్డ్ తీసుకెళుతున్న సమయంలో బంజారాహిల్స్ లో రోడ్డుపై వరదనీటిలో బ్యాగ్ కొట్టుకు పోయింది. అయితే స్థానికులతో కలిసి బ్యాగ్ కోసం వెతికిన క్రమంలో ఖాళీ బ్యాగ్ వారికి దర్శనం ఇచ్చింది. ఈ క్రమంలో బంజారాహిల్స్ పీఎస్ లో కృష్ణ పెరల్స్ యజమాని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేసి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కోటి రూపాయలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.