మిగిలిపోయిన చైనీస్ ఆహారాన్ని తిన్న 19 ఏళ్ళ విద్యార్థి కాళ్ళని, వేళ్ళని కోల్పోయాడు..!

-

మిగిలిపోయిన చైనీస్ ఆహారాన్ని తిన్న 19 ఏళ్ల విద్యార్థి కాళ్ళు మరియు వేళ్ళని కోల్పోయాడు. బోస్టన్, యుఎస్ రెస్టారెంట్ లో చైనీస్ ఫుడ్ ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నాడు. దీంతో ఇంత పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. రిపోర్టు ప్రకారం చూసుకున్నట్లయితే… సెప్సిస్ మరియు గ్యాంగ్రీన్ సమస్య వచ్చిందని మిగిలిపోయిన, పాడైన ఆహారాన్ని తినడం వల్ల ఇది జరిగిందని తెలుస్తోంది.

 

ఆ తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్. స్కిన్ మొట్లింగ్ వంటి సమస్యలు వచ్చాయని తెలిసింది. ఆసుపత్రిలో అడ్మిట్ చేయడానికి 20 గంటలు ముందు వరకు బానే ఉన్నాడు. అప్పుడు కొద్దిగా వికారం, కడుపు నొప్పి మాత్రమే ఉంది అని అన్నారు.

రెస్టారెంట్ లో మిగిలిపోయిన అన్నం, చికెన్ మరియు ఇతర ఆహార పదార్థాలను తాను తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను రెస్టారెంట్లో పార్టీ టైం వర్కర్ కింద పని చేస్తున్నాడు. పేరు లేని చైనీస్ అవుట్లెట్ నుండి తను ఈ ఆహారాన్ని తీసుకున్నాడు. పాడైన ఆహారం తినడం వలన చలి వేసిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, కంటిచూపు సమస్యలు, చెస్ట్ పెయిన్ వంటివి వచ్చాయి.

అలానే చర్మం పర్పుల్ రంగులోకి మారిపోయింది అని తన స్నేహితుడు చెప్పాడు. బ్లడ్ మరియు యూరిన్ టెస్ట్ చేయగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందని దీనిని పర్పురా ఫలమినన్స్ అని అంటారు అని తెలుస్తోంది. దీని వల్ల ఏమవుతుంది అంటే రక్తం గడ్డ కట్టేసింది. అలానే లివర్ కూడా ఫెయిల్యూర్ అయ్యింది. కాళ్ళని, వేళ్ళని కూడా కోల్పోయాడు

Read more RELATED
Recommended to you

Latest news