ఎమ్మెల్యే ఎన్నికలపై 7వ తరగతి విద్యార్ధి షాకింగ్ ఆన్సర్

-

ప్రస్తుత సమాజంలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో అద్దం పట్టేలా ఓ విద్యార్థి ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఆ విద్యార్ధి పరీక్షలో రాసిన జవాబు నెట్టింట్లో వైరల్ మారింది. 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి పరీక్షల్లో ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో అని వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే కోసం పోటీపడేటోళ్లు ఇంటింటికి వస్తారని, పెద్దోళ్లకు పైసలు, బిర్యానీ, అలాగే, ఆడోళ్లకు చీరలకు కూడా పంచుతారని, అవి తీసుకుని పెద్దోళ్లు ఓట్లు వేస్తారని, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలుస్తారని రాశాడు.

అయితే ఈ విద్యార్ధి రాసిన జవాబుకు టీచర్ 4 మార్కులు కూడా వేయడం గమనార్హం. దేశంలో రాజకీయాలు డబ్బుపై, మందు సీసాలపై, ఆడోళ్ళ చీరలు, బిర్యానీ ప్యాకెట్లతో నడుస్తోందని ఈ 7వ తరగతి విద్యార్ధి చెప్పకనే చెప్పాడు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మరో కోణంలో క్యాప్షన్లు పెడుతూ షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version