గురుకులంలో నీళ్లు లేక ప్రాణాలను పణంగా పెడుతోన్న విద్యార్థులు

-

రాష్ట్రంలోని గురుకులాల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అటు భోజనం సరిగా పెట్టకపోవడంతో కనీస నీళ్ల సదుపాయాలు కూడా లేకపోవడం, అంతేకాకుండా అన్ని పనులను విద్యార్థులతో చేయిస్తున్నట్లు రోజుకో ఘటన వెలుగుచూస్తున్నాయి.

తాజాగా నిర్మల్ జిల్లా డ్యాంగపూర్ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో వర్కర్లు చేసే పనిని విద్యార్థులతోనే నిర్వాహకులు చేయిస్తున్న దృశ్యాలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. దీనికి తోడు నీరు లేక తమ ప్రాణాలను పణంగా పెట్టి మెట్లు లేని ట్యాంక్ ఎక్కి విద్యార్థులు నీటిని తోడుకుంటున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version