ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ. కాకినాడ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ యాక్షన్ గబ్బర్ సింగ్ సినిమా 3 చూశామని ఎద్దేవా చేశారు. పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడం ఎవరు చేసిన తప్పే చర్యలు ఎందుకు తీసుకోరు….ఎమ్మెల్యే సెట్ అయిపోయాడని మాట్లాడటం ఎందుకు అంటూ నిలదీశారు. సివిల్ సప్లైస్ మంత్రి ఏం చేస్తున్నాడు…. ఆయన ఫెయిల్ అయ్యాడా…..? అని ప్రశ్నించారు.
ప్రభుత్వాలను వ్యక్తులు ప్రభావితం చేస్తుంటే చూస్తూ ఊరు కుంటామా….అని నిలదీశారు. ఎక్స్ పోర్టలర్లను ఢిల్లీకి తీసుకుని వెళ్ళి… పర్మిషన్ లు ఇప్పించింది బీజెపీ నాయకులు అవునా కదా ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆగ్రహించారు. కాకినాడ పోర్టులో రెడ్డి వుంటే మాకెందుకు కమ్మ వుంటే మాకెందుకు తప్పు చేస్తే చర్యలు తీసుకోండి…..డైవర్షన్ పాలిటిక్స్ వద్దు చురకలు అంటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ కపోతే ఎవరికైనా ఒక్కటే సమాధానం వస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ.