రేవంత్ అన్న ఇచ్చిన ధైర్యం.. స్టూడెంట్స్ వీడియో వైరల్..!

-

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికె చాలా మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. బస్సులో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే ఉచిత ప్రయాణం పై మహిళల స్పందన పలు విధాలుగా ఉంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణం పై స్టూడెంట్స్ వీడియో తెగ షికార్లు కొడుతోంది.

ఫోన్లో చార్జింగ్ లేదు చేతిలో డబ్బులు లేవు.. ఫోన్ పే చేసే ఫ్రెండ్ లేడు.. ఏంట్రా నీ ధైర్యం మా రేవంతన్న ఇచ్చిన ధైర్యం రా అని వీడియోలో చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా రాత్రి టైంలో ఒక బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నట్లు వీడియోలో ఉంటుంది. ఇంకొంతమంది అయితే ఉచిత ప్రయాణం వలన సిబ్బంది తమని చులకనగా చూస్తున్నారని అంటున్నారు స్టేజీల వద్ద ఎక్కువ మంది మహిళలు కనపడితే బస్సులను ఆపట్లేదని కొంతమంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version