రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

-

ఈ రబీ సీజన్లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.22,303 కోట్ల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 OCT 1-2024 MAR 31 మధ్య నత్రజని (కేజీ రూ.47.2), భాస్వరం(కేజీ రూ.20.82), పొటాష్ (కేజీ రూ.2.38), సల్ఫర్(కేజీ రూ.1.89) తదితర వాటిపై సబ్సిడీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. టన్ను డీఏపీపై సబ్సిడీ రూ.4500గా కొనసాగుతుందని వెల్లడించింది. రైతులు డీఏపీ బస్తాకు రూ.1350 మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని వివరించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎరువుల రేట్లు పెరిగినా కూడా రైతులపై భారం పడనివ్వకుండా ఎరువులపై సబ్సిడీ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) ఒక టన్నుకు రూ.4500ల సబ్సిడీ కొనసాగనుంది. ఇక రైతులు పాత రేటు ప్రకారమే ఒక డీఏపీ బస్తాకు రూ.1350 చెల్లించవచ్చు. అలాగే ఎన్‌పీకే (నెట్రోజన్,పాస్పరస్, పోటాషియం) వంటి ఎరువుల కోసం ఒక బస్తాకు రూ.1470 చెల్లించవచ్చు. ఈ మేరకు ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ వివరాలను వెల్లడించారు.
రైతులకు సులభంగా, అందుబాటు ధరలో ఎరువులు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా యూరియా, డీఏపీ, ఎంఓపీ (మ్యూరియెట్​ ఆఫ్​ పొటాష్), సల్ఫర్​ వంచి ఎరువుల ధరలు పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. రైతులకు తక్కువ ధరలో ఎరువులు లభ్యమయ్యేలా.. ఆమోదించిన రేట్ల సబ్సిడీని ఎరువుల తయారీ కంపెనీలకు చెల్లిస్తామని వెల్లడించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version