చాలామంది ఎన్నో అనుకుంటారు కానీ అన్నిటిలోను విజయం సాధించలేరు. ఎక్కువ శాతం మంది ఏదైనా పని చేయాలంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. పైగా వాళ్ళ పై వాళ్ళు నమ్మకం పెట్టుకోకుండా పనులను చేస్తూ వుంటారు. దీనితో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నిజంగా వీళ్లను మాత్రం మెచ్చుకోవాలి. కేవలం వీళ్ళు వేల రూపాయలతో బిజినెస్ ని మొదలు పెట్టి మంచి లాభాలను పొందుతున్నారు. మరి ఈ కాలేజీ యువకుల సక్సెస్ స్టోరీ చూద్దాం.
చిన్న ఆలోచన నుండి వీళ్ళు కోట్లలో వ్యాపారాన్ని చేస్తున్నారు. ప్రభా కిరణ్ సింగ్,సిద్ధార్థ మనోట్ ఇద్దరూ కూడా బేవకూఫ్ డాట్ కామ్ ని మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీ భారతదేశపు అతిపెద్ద రీసైక్లింగ్ కంపెనీగా మారింది. కళాశాలలో చదువుతున్నప్పుడే వీరిద్దరూ ఈ బిజినెస్ ని మొదలు పెట్టారు. వీళ్లిద్దరు ఎన్నో వ్యాపారాలుని మొదలు పెట్టారు. అయితే టీ షర్ట్ ప్రింటింగ్ అనేది కూడా అందులో ఒకటి.
2010లో డొమైన్ పేర్లను వీళ్ళు వెతికారు. ఫైనల్ గా బేవకూఫ్ డాట్ కామ్ ని మొదలుపెట్టారు. ఎన్నో కొత్త ఆవిష్కరణలు వీళ్ళ వ్యాపారంలో చేయడం మొదలుపెట్టారు. టీ షర్టు పై ప్రింట్ చేసి విక్రయించడం మొదలుపెట్టగా ఆదరణ లభించింది. దీనితో దానినే కొనసాగించారు తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందగలిగారు.
వ్యాపారాన్ని త్వరగా ఎక్స్టెండ్ చేశారు కూడా. 30 వేల రూపాయలతో ఈ కంపెనీని ప్రారంభిస్తే ప్రస్తుతం 200 కోట్లు గా మారింది ఈ బిజినెస్. చూశారు కదా ఈ ఇద్దరు యువకులు మొదలుపెట్టిన కంపెనీ ఎలా సక్సెస్ పొందిందని.. మరి తప్పకుండా వీళ్ళని మెచ్చుకోవలసిందే. ఆదర్శంగా వీరిని తీసుకుంటే కచ్చితంగా మీరూ సాధించగలరు.