కృష్ణ దశదిన కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన సుధీర్ బాబు

-

హైదరాబాద్ లో సూపర్ స్టార్ కృష్ణ దశదిన కర్మ నిర్వహిస్తున్నారు. కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక జేఆర్సీ కన్వెన్షన్ లో అభిమానుల కోసం ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో కృష్ణ అభిమానులు తరలివచ్చారు.

అక్కడ అభిమానులతో ముచ్చటించారు హీరో సుదీర్ బాబు, గల్లా అశోక్, కుటుంబ సభ్యులు. ఈ సమయంలో హీరో సుధీర్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. స్టేజి పైనే బోరున ఏడ్చేశారు సుధీర్ బాబు. తాను ఎన్ని జన్మలు ఎత్తిన కృష్ణ గారికి అల్లుడు గానే పుట్టాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో మాట్లాడుతూ.. “నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా మీ అభిమానం. మీ అభిమానం నాకు ఎప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ” అన్నారు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version