ఖమ్మంలో బాబు సభ..బస్సు యాత్రకు టీటీడీపీ.!

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే యాక్టివ్ అవుతుంది..ఇప్పటివరకు దారుణమైన స్థితిలో టీడీపీకి కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కాస్త ఊపిరి పోయడానికి చూస్తున్నారు. పార్టీ శ్రేణులని యాక్టివ్ చేసి..మళ్ళీ పార్టీ బలాన్ని పెంచే దిశగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి..పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో సమావేశం అవుతూ..భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అలాగే పార్టీలో పలు విభగాలని యాక్టివ్ చేయాలని చూస్తున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని పెట్టే దిశగా పనిచేస్తున్నారు.

ఇదే క్రమంలో తెలంగాణలో పార్టీకి మరింత ఊపు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ సభ ఏర్పాటు చేసి..చంద్రబాబుని తీసుకురానున్నారు. డిసెంబర్ 21న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించి..అక్కడే భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభని సక్సెస్ చేసి..అక్కడ నుంచి తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. గ్రామ గ్రామనా తెలుగుదేశం జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలో సత్తా చాటాలని కాసాని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి లీడర్లు లేరు. అయితే కాంగ్రెస్ బలంగా ఉంది గాని..బలమైన నాయకులు తగ్గారు. దీంతో అక్కడ పాత టీడీపీ నేతలని చేర్చుకుని బలపడాలని టీడీపీ చూస్తుంది. ఖమ్మం సభలో చంద్రబాబు సమక్షంలో పలువురు నేతలని చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.

అయితే తెలంగాణలో టీడీపీ భవిష్యత్ ఖమ్మం సభ తర్వాత మారిపోతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అక్కడ నుంచి దూకుడుగా రాజకీయం చేస్తామని అంటున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాలకు ప్రాధాన్యత పెంచుకుంటూ వెళ్లాలని చూస్తున్నారు. మరి చూడాలి ఖమ్మం సభ తర్వాత తెలంగాణలో టీడీపీకి ఊపు వస్తుందేమో.

Read more RELATED
Recommended to you

Exit mobile version