బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు..అందుకేనా..?

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సినీ ఇండస్ట్రీలోకి బాలా నటుడిగా అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హరికృష్ణ వారసుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన నటనకు విదేశాలలో సైతం అభిమానులుగా మారిపోయారు. ఇక దేశం నలుమూలల ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ కేవలం సినిమాల ద్వారానే కాదు సేవా గుణంతో కూడా ఎప్పటికప్పుడు అటు ప్రేక్షకులను , ఇటు సామాన్య ప్రజలను మెప్పిస్తూనే ఉంటాడు.

ఇకపోతే ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తాత ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని చేతుల్లోకి తీసుకోవాలని ఆ పార్టీ రాజకీయ నాయకులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని విపరీత కారణాలవల్ల ఆయన రాజకీయాల వైపు వచ్చే ప్రసక్తే లేదు అని ఇటీవల ఆయన స్నేహితుడు అలాగే వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కానీ ఆయనే మాట్లాడుతూ అవసరం ఉన్నప్పుడు పగ్గాలు పట్టుకుంటాడు అంటూ కూడా తెలిపే అభిమానులకు ఆశ కలిగించారు.ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోల పుట్టినరోజు నాడు.. తమ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేసి రికార్డులు కొల్లగొడుతుంటే.. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు తాము ఇలాంటి హడావిడి ఎందుకు చేయలేకపోయాము అంటూ మదన పడుతున్నట్లు సమాచారం. ఏదేమైనా గడిచిన సమయాన్ని గుర్తు చేసుకుని బాధపడడం వృధా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version