“నిమ్మగడ్డ”కు ప్రత్యేకం: “మనలోకం.కాం” సూచన ఇది!

-

తన పదవీకాలం ముగిసేలోపు ఎట్టిపరిస్థితుల్లోనూ, ఎవరు ఏమైనా, ఎవరి ఆరోగ్యం ఏమైనా, రాష్ట్రం ఏమైపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని భావిస్తున్న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉడతా భక్తిగా “మనలోకం.కాం” కొన్ని సూచనలు చేస్తుంది! ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించి తీరాలని ఆయన భావిస్తే… వద్దు అని అంటున్న ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది!

అవును… స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌పాలా వ‌ద్దా అనే అంశంపై అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు ప‌లు రాజ‌కీయ పార్టీలకు చెందిన ఒక్కో నేత‌తో ఎస్ఈసీ స‌మావేశ‌మైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో నిమ్మగడ్డ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటించే క్రమంలో.. సామాజిక దూరం, జాగ్రత్తలను అనుసరించడానికి, సమయ స్లాట్ ‌లతో వ్యక్తిగత సంప్రదింపులు జరపడం జరిగిందని చెప్పుకొచ్చారు! ఇది అభినందించాల్సిన నిర్ణయం!

మరి ఒక విశాలమైన గదిలో నలుగురు పెద్ద మనుషులు కూర్చోడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్… పోలింగ్ బూత్ ల విషయంలో కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాలని “మనలోకం” సూచిస్తోంది! ఇందులో భాగంగా… ఓటు ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ కి వారి వారి నిర్ధేశిత సమయాన్ని, స్థలాన్ని మెసేజ్ రూపంలో అందించాలని సూచిస్తుంది!

అలా చేయడం వల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ జనాలు ఇబ్బంది పడరు, కరోనా భారిన పడరు! ప్రభుత్వం చెబుతున్న కరోనా సాకు నుంచి నిమ్మగడ్డ, ప్రజలను రక్షించినవారవుతారు! ఫలితంగా జనాల్లో హీరో అవుతారు!! అవును… ప‌ది నిమిషాలు ఇద్దరు వ్యక్తులతో మాట్లాడ్డానికే అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ నిమ్మ‌గ‌డ్డ… ఓటు వేయ‌డానికి గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్ల‌లో నిలుచునే జనాలకు కూడా స్లాట్లు, మాస్కులు, శానిటైజర్లు, ప్రతీ ఓటరు తర్వాత ఈవీఎం మిషన్ కు శానిటైజ్ చేయడం చేస్తే… కచ్చితంగా ఎన్నికలు నిర్వహించవచ్చు!!

ఇది కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచన మాత్రమే. ఇవి పాటించని పక్షంలో.. తనది మాత్రమే ఆరోగ్యం.. ప్రజలకు అవసరం లేదు.. వారు ఎలాపోతే తనకేంటి.. తన పంతం తాను గెలిపించుకోవాలి.. తన రహస్య స్నేహితులకు న్యాయం చేసినట్లు ఉండాలి అని భావిస్తే… ఇకపై ప్రభుత్వం – నిమ్మగడ్డ చూసుకోవచ్చు! కానీ… ఒకటే మాట నిమ్మగడ్డ… “జనాల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు మాత్రం మీకు లేదు” అని గ్రహించాలి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version