సినీ ఇండస్ట్రీలో ఒడిదుడుకులు అనేది సహజం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఉన్నట్టుండి కొంతమంది ని ఆకాశానికెత్తేసే సినీ ప్రేక్షకులు..మరికొంతమందిని అధః పాతాళానికి తొక్కి వేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అదే ప్రతిభ లేక నటనతో మెప్పించలేక.. అదృష్టం కలిసి రాకపోతే వారికి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టంగా మారుతుంది. ఇక ఎంత కుటుంబ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ ప్రతిభ అనేది చాలా అవసరం. ఇక ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ లను చవిచూసి ఆస్తులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక మరికొంతమంది అలాంటి ఆలోచనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మెగాబ్రదర్ నాగబాబు కూడా ఒకరు.
ఇకపోతే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. అరుదుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్ర పోషిస్తూ వస్తున్న నాగ బాబు ఆస్తి మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. 2019లో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున నరసాపురం ఎంపీ పదవికి పోటీ చేసి వైసీపీ కార్యకర్త రఘురామ కృష్ణం రాజు చేతిలో ఘోరంగా ఓడిపోయారు ఇక ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో నాగబాబు తనకు తన భార్యకు కలిపి మొత్తంగా 41 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది అని సూచించారు. ఇక ఇందులో వాహనాలు , చరాస్తుల విలువ రూ.36.73 కోట్లు ఉండగా.. స్థిరాస్తుల విలువ రూ.4.22 ఓట్లు అలాగే అప్పు రూ.2.70 కోట్లు ఉన్నట్లు చూపించడం జరిగింది మొత్తానికి అయితే రూ.100 కోట్లకు పైగా ఆస్తి కూడ పెట్టినట్లు సమాచారం.