నా తాత, నా కుమారుడి ఇల్లు ఇక్కడే ఉన్నాయి అని సుజనా చౌదరి అన్నారు. నాకు ఇక్కడే వ్యవసాయ పొలం ఉంది. నేను బెజవాడకు 20 కిలోమీటర్ల దూరంలో పుట్టాను. ఇక నేను నాన్ లోకల్ వ్యక్తి అనే వారే సమాధానం చెప్పాలి అని సుజనా చౌదరి అన్నారు. నేను పోటీకి దిగిన తర్వాత ప్రత్యర్ధి పార్టీలో భయం మొదలైంది అని సుజనా చౌదరి అన్నారు. అందుకే నేను అందుబాటులో ఉండను అని అనేక ఆరోపణలు చేస్తున్నారు అని సుజనా చౌదరి అన్నారు.
ఇక వాళ్ళ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పశ్చిమ నియోజకవర్గం మౌఖిక వసతుల పరాంగా చాలా వెనుక పడింది. గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి చేస్తాను. నేను టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పోటీకి దిగలేదు కష్టపడి గెలవాలనే పశ్చిమ ఎంచుకున్నాను అని సుజనా చౌదరి అన్నారు.