ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజధాని చుట్టూనే రాజకీయం తిరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అధికార వైసీపీ రాజధాని కేంద్రం గా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాజధానిని మారుస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటన చేయగానే ఒక్కసారిగా అధికార పార్టీపై విపక్ష తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. అసలు రాజధానిగా అమరావతినే ఉంచాలని టీడీపీ ఎక్కువగా డిమాండ్ చేస్తుంది.
రాజధానిపై జగన్ ప్రకటన చేసిన తొలి రోజుల్లో బిజెపి ఎంపీ సుజనా చౌదరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా బలహీనంగా ఉన్న టీడీపీకి ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త కొత్త జోష్ ఇచ్చాయి. రాజధాని విషయంలో కేంద్రం ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తుంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు ఆయనకు రాజధాని రక్షకుడు అనే పేరు పెట్టుకున్నారు.
ఇక రాజధాని విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజధాని గురించి ఎవరికి చెప్పాలో వారికి చెప్తా అన్నారు ఆయన. ఆ తర్వాత సుజనా కూడా పలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే ఇప్పుడు ఆయన దీనిపై ఒక మాట కూడా మాట్లాడటం లేదు. ఆయన నుంచి ఏ ఒక్క ప్రకటన రావడం లేదు ప్రస్తుతం.
దీనిపై ఇప్పుడు రాజకీయ పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన నుంచి ఏ మాటా రాకపోవడానికి ప్రధాన కారణం… పెద్దలు ఆయన్ను కంట్రోల్ చేసారని, రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని, అనవసరంగా విషయం లేని మాటలు మాట్లాడవద్దు అని సూచించారని అంటున్నారు. అందుకే సుజనా కంట్రోల్ అయ్యారని… తద్వారా చంద్రబాబు ని కూడా క్రమంగా కంట్రోల్ చేసే అవకాశ౦ ఉందని అంటున్నారు.