సుకన్య సమృద్ధి యోజన పధకం ఆడపిల్లల ఉన్నత విద్య, పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ముందు నుంచే పొదుపు చేయడానికి ఈ పథకం ఉపయోగ పడుతుంది. మీరు సుకన్య సమృద్ధి యోజన పధకంని ఓపెన్ చెయ్యాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లో ఈ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులువు. అయితే మరి ఎలా ఉపయోగించాలి..? ఎంత డిపాజిట్ చేయాలి..? ఇలా అనేక విషయాలు మీకోసం.
అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. బ్యాలెన్స్ ని ఆన్‌లైన్‌లో చెక్ చేయొచ్చు. దీనికి అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ బ్యాంకు నుంచి తీసుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6% వడ్డీ చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇది ఇలా ఉండగా ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80సీ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం లో రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.