త‌గ్గేది లేదంటున్న సుకుమార్.. పుష్ప‌లో బోట్ ఫైట్‌!

-

అల్లు అర్జున్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అయితే ఆయ‌న మాస్ క్రేజ్‌కు త‌గ్గ‌ట్టు ఇప్పుడు మొద‌టిసారి ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్ష‌న్‌లో పుష్ప మూవీని భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్నారు. ఇక సుకుమార్ సినిమా అంటేనే కథ చాలా కొత్త‌గా ఉంటుంది. అందులోనూ యాక్ష‌న్ సీన్స్ కండ్ల‌కు అద్దం ప‌ట్టేలా ఉంటాయి.

 

ఇక పుష్ప సినిమాను రెండు భాగాలుగా తీస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్యాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి భారీ సెట్టింగ్‌ల‌తో మూవీ షూటింగ్ చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే యాక్ష‌న్ సీన్స్ గూస్ బంప్స్ అన్న‌ట్టు ఉంట‌యాని తెలుస్తోంది. ఆడియెన్స్‌ను క‌ట్టిప‌డేసేలా ఫైట్ సీన్లు ఉంటాయంట.

ఇక పుష్ప‌ మూవీలో ఓ బోట్ ఫైట్‌ను భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్నార‌ని తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఇప్ప‌టికే వ‌చ్చిన‌ కొన్ని సినిమాల్లో బోట్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉన్నాయి. కానీ వాట‌న్నింటినీ త‌ల‌ద‌న్నేలా పుష్ప ఫైటింగ్ సీన్ ఉంటుందంట‌. కొవిడ్ సెకండ్ వేవ్ తో ప్ర‌స్తుతం పుష్ఫ షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ర‌ష్మిక మండ‌న్న హీరోయిన్‌గా చేస్తుంది. మ‌రి ఏ రేంజ్‌లో ఈ సినిమా ఫైట్లు ఉంటాయో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version