హైదరాబాద్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీరమణ కుటుంబానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామివారికి ఎన్వీరమణ కుటుంబం ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాలతో ఎన్వీ రమణ కుటుంబాన్ని అర్చకులు ఆశీర్వదించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించిన సీజేఐ
-