Big Boss OTT : ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్‌తో ‘జయమ్మ పంచాయితీ’..అరటికాయగానే ఉన్నావంటూ శ్రవంతిపై సుమ పంచ్..

-

ఉగాది సందర్భంగా స్పెషల్ గెస్ట్ గా యాంకర్ సుమ ‘బిగ్ బాస్’ ఓటీటీ హౌస్ కు వెళ్లింది. అక్కడ సందడి చేయడమే కాదు.. కంటెస్టెంట్స్ పైన పంచుల వర్షం కురిపించేసింది. ఒక్కొక్కరిగా అందరినీ టార్గెట్ చేసి రచ్చ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 22న ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్ర ప్రమోషన్స్ కూడా చేసేసింది సుమ.

ప్రోగ్రామ్ ఏదైనా యాంకర్ సుమ.. మాటలు మాత్రం అలా జల జల పారుతున్న గోదారిలాగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఇక ‘ఓటీటీ’ వర్షన్ అయిన నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ సెన్సార్ కూడా ఏం ఉండనక్కర్లేదన్నట్లు మాట్లాడుతూనే ఉన్నారు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఉగాది సందర్భంగా ఫుడ్ ఐటమ్స్ అందివ్వనున్నట్లు తెలిపింది సుమ.

మాంచి మాంచి ఘాటైన రసం.. మహేశ్ విట్టా అని పేర్కొన్న సుమ.. అసలు నీరసం లేని రసం ఎవరైనా ఉన్నారంటే అది మహేశ్ విట్టానే అని కాంప్లిమెంట్ ఇచ్చింది. ‘బిగ్ బాస్’ హౌజ్ లో మహేశ్ విట్టా చాలా యాక్టివ్ గా ఉంటాడని చెప్పకనే చెప్పేసింది సుమ. ఇకపోతే కంటెస్టెంట్ శ్రవంతిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుమ. ఇప్పటి వరకు శ్రవంతి ఇంకా కాయగానే ఉందని పండాలని సూచించింది.

ఇప్పటి వరకు తాను ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ లో విసిరేస్తే ఏం కానిది ఏదైనా ఉంది అంటే అది అరటి కాయలేనని అంది. అలా అరటి కాయలను విసిరేస్తానంటూ సుమ చెప్పింది. అయితే, ఫుడ్ వేస్ట్ చేయొద్దని కంటెస్టెంట్స్ సూచించడంతో అరటి పండ్లను అక్కడే పెట్టేసింది సుమ. అరటి కాయలాగా ఇంకా అలానే శ్రవంతి పచ్చిగా ఉందని, పండాల్సిన అవసరముందని శ్రవంతికి చెప్పింది. సాధారణ బియ్యంలాగా అనిల్ ఉన్నాడని, ఇంకా ఏదో ఒకటి కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వివరించింది సుమ.

Read more RELATED
Recommended to you

Exit mobile version