ఒకరేమో కమెడియన్ నుంచి హీరోగా మారిన వ్యక్తి. ఆమె నేమో యాంకర్ నుంచి యాక్టర్ గా మారింది. వీరిద్దరూ ఎప్పుడూ కలిసి సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. వీరిద్దరూ కలిసి ఇప్పుడు సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ వారెవరో మీకు గుర్తుకు వచ్చిందా. ఎక్కువగా ఆలోచించకండి వారి పేరు సునీల్, అనసూయ. వీరిద్దరూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న వారే.
కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సునీల్.. మర్యాద రామన్న సినిమాతో హీరోగా మారాడు. ఇక అప్పటి నుంచి హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కాకపోతే ఇప్పటి వరకు మనోడికి సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. ఈ మధ్య అడపా దడపా పెద్ద హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు మనోడు. దీంతో పాటే మళ్లీ హీరోగా స్థిరపడాలని ప్రయత్నాలు కూడా సాగిస్తున్నాడు. ఈ మధ్య సునీల్ హీరోగా సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. కాగా ఇప్పుడు ఓ సినిమాను ఓకే చేసినట్టు సమాచారం.
ఇక యాంకర్ అనసూయ రంగస్థలం సినిమాతో యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. రంగమ్మత్తగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక వరుసగా సినిమాలు కూడా చేస్తూ.. తన యాంకరింగ్ కూడా కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం థ్యాంక్ యూ బ్రదర్ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా సునీల్ సినిమాలో అనసూయ భరద్వాజ్ జోడీ కడుతున్నారని తెలుస్తోంది. ఈమెకు తక్కువ సన్నివేశాలే ఉన్నా కూడా మంచి రేంజ్ ఉన్న పాత్ర అని సమాచారం. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉంటాయంట. చూడాలి ఇక సినిమా ఎలా ఉంటుందో.