తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది సేపటి క్రితం రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమించింది. కమిషన్‌లో మరో ఆరుగురు సభ్యులకు కూడా చోటు కల్పించింది. షహీనా అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరి భాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గడ్డల పద్మ, సుధం లక్ష్మీ, కటారి రేవతిలను కమిషన్ సభ్యులుగా నియమించారు.
అలానే కమిషన్ పదవీ కాలాన్ని ఐదేళ్ల పాటు ఉండేలా ఉత్తరువుల్లో పేర్కొన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఈ కమిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ కమిషన్ ని ఏర్పాటు చేయక పోతే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో హుటాహుటిన ఇప్పుడు కమిషన్ ని ఏర్పాటు చేశారు.