నేటి నుంచి రైతు బంధు.. ముందు వీరికే !

-

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సాయం అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సీజన్ కోసం ఈరోజు నుంచి రైతు బంధు సాయాన్ని అందచేయాలని రెండు రోజుల క్రితం నిర్ణయించింది. గతంలో చెక్కుల రూపంలో ఈ రైతు బంధు సాయం ఇచ్చే వారు కానీ ఈసారి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.7,300 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

ఈ రోజు నుండి జనవరి 7వ తేదీ వరకు విడతల వారీగా రైతు బంధు సొమ్మును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ముందుగా ఎకరం లోపు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చేయనున్నారు. ఆ తర్వాత రెండెకరాల లోపు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తారు. ఆపై మూడెకరాల లోపు పొలం ఉన్నవారి ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇలా విడతల వారీగా రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news