సునీత పెళ్లికి ముహర్తం ఖరారు..ఎప్పుడంటే ?

-

టాలీవుడ్లో టాప్ సింగర్ సునీత పెళ్లి ముహూర్తం ఖరారయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె వివాహం ఈనెల 26వ తేదీన జరిగే అవకాశం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమె మాంగో డిజిటల్ మీడియా అధినేత రామకృష్ణ వీరపనేని అనే ఆయనతో వివాహ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి 27వ తారీకు ఉంటుందని ముందు ప్రచారం జరిగింది.

కానీ ఆ తర్వాత వీరిద్దరి జాతకాలు కలవలేదని ఎప్పుడు ముహూర్తాలు కుదిరితే అప్పుడు పెట్టుకుంటామని సునీత చెప్పినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 26వ తేదీన విడుదల వివాహానికి ముహూర్తం కుదిరిందని అంటున్నారు. కరోనా కారణంగా కేవలం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి జరుగనుందని చెబుతున్నారు. అయితే ఇది ముందు నుంచి ప్రచారం జరిగినట్టు ఇది కూడా పుకారో లేకపోతే నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే

Read more RELATED
Recommended to you

Latest news