జగన్ బీసీ సంక్రాంతి సభకు వచ్చిన పలువురు నిన్న అస్వస్థత గురయ్యారు. ఫుడ్‌పాయిజన్‌తో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ముగ్గురు చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రహ్మయ్య అనే వ్యక్తి మృతి చెందడం సంచలనంగా మారింది. మరో ఇద్దరు బాధితులను గుంటూరు ఆస్పత్రికి తరలించినట్టుగా సమాచారం అందుతోంది. బాధితులు ప్రకాశం జిల్లా మార్కాపురం వాసులుగా గుర్తించారు. ఈ అంశం మీద అచేన్నాయుడు మాట్లాడుతూ బీసీ సంక్రాంతి సభలోని దుర్ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బడుగుల ప్రాణాలపై జగన్ చిత్తశుద్ధి మరోసారి స్పష్టమైందని అన్నారు.
బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని అన్నారు. బలహీన వర్గాలంటే ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో ఈ ఘటనతో స్పష్టమైందన్న ఆయన వైసీపీ నేతలకు, మంత్రులకు అవ్వని ఫుడ్ పాయిజన్ సామాన్యులకు అయ్యిందంటే వారికి ఎలాంటి ఆహారం ఇచ్చారో అర్ధమవుతోందని అన్నారు. బాధితులను పరామర్శించేందుకు కూడా వైసీపీ నేతలు రాకపోవడం దుర్మార్గం అని అన్నారు.