డైపర్ మాస్క్ ధరించిన సన్నీ లియోన్…!

-

కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రముఖులు అందరూ కూడా ప్రజలను అలరించే ప్రయత్నాలను తమ ఇంట్లో ఉండే చేస్తున్నారు. ప్రేక్షకులు తమను మర్చిపోవద్దని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి సన్నీ లియోన్ ఒక పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. ఫేస్ మాస్క్ లు, గ్లౌజులను ఆమె కాస్త భిన్నంగా ధరించింది. అయితే డైపర్ తో ఆమె ఫేస్ మాస్క్ ధరించడం సంచలనంగా మారింది.

తన ఇంట్లో ఉన్న వివిధ వస్తువులను ఆమె మాస్క్ లు చేతి గ్లౌజులుగా వాడింది. బయటకు వెళ్ళడానికి మీకు అత్యవసర ఫేస్ మాస్క్ కావాల్సిన సమయంలో… అప్పుడు కేవలం 30 సెకన్లు మాత్రమే ఉంటే అని ఆమె ఈ పోస్ట్ చేసింది. ఇక ఆపరేషన్ థియేటర్ లో వాడే గ్లౌజులను కూడా ఆమె వాడింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

కొందరు తిడుతుంటే మరి కొందరు అభినందిస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు ఇది మీ స్థాయి దిగజారుస్తుంది అని సూచనలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సన్నీ చేసిన ఈ ప్రయత్నానికి మాత్రం సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఇటీవల బెంగాల్ కి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఇదే ప్రయత్నం చేసాడు. ఫేస్ మాస్క్ గా అతను డైపర్ ధరించి రోడ్డు మీదకు వెళ్ళాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version