Sunrisers Hyderabad vs Gujarat Titans, 66th Match: ఇవాళ ఉప్పల్ వేదికగా జరగాల్సిన SRH-GT మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. సాయంత్రం నుంచి కోనసాగిన వాన ఎంతకీ తగ్గకపోవడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. దీంతో మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే 15 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ (Sunrisers Hyderabad) నేరుగా ప్లేఆప్స్ కు చేరుకుంది. GT ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.