Rains likely in Telangana over next 5 days: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది.

ఇవాళ మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50KM వేగంతో ఈదురు గాలులు విస్తాయని తెలిపింది. మిగతా రోజుల్లో వానలు కురిసే జిల్లాల జాబితాలను తెలిపింది. కాగా హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సీఎం సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.