సూపర్ ఛాలెంజ్ చేసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు..!!

తాజాగా ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్ నవాద్ లాపిడ్ కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఉద్దేశించి  నెగిటివ్ కామెంట్స్ చేయడం తో దేశంలో మళ్లీ వివాదం చెలరేగిన సంగతి అందరికి తెలిసిందే.వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’  మంచి వసూళ్లు రాబట్టింది. గతంలో నూ ఈ సినిమా పై చాలా వివాదాలు కూడా వచ్చాయి. ఇది రాజకీయ నాయకులు మధ్య వార్ నడిచేలా చేసింది.

ఇక తాజా వివాదం పై మరియు లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా తన దైన శైలిలో  స్పందించారు. తన సినిమాలో కావాలని చూపించినవి ఏమి లేవని పచ్చినిజాలు మాత్రమే చూపించామని, ఎవరైనా ఇందులో అబద్ధాలు ఉన్నట్లు గాని  నిరూపిస్తే తాను సినిమాల నుంచి తప్పుకుంటానని లాపిడ్‌కు సవాల్ విసిరారు. ‘ప్రపంచ మేధావులకు, ఈ మహా గొప్ప ఇజ్రాయెల్‌ చిత్రనిర్మాతకు ఇదే నా సవాల్. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఒక్క ఫ్రేమ్ కానీ, ఒక్క డైలాగ్ కానీ, ఒక్క ఘటన కానీ అసత్యం అని నిరూపించండి చాలు. నేను ఇక సినిమాలు తీయడం మానేస్తా’ అని వివేక్ అగ్నిహోత్రి ఛాలెంజ్ విసిరారు.

ఇక దీనిపై మరోసారి రాజకీయ నాయకులు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీవి డిబేట్స్ లో లో ఒకరి పై ఒకరు దొమ్మెత్తి పోసుకుంటున్నారు.. ఇలాఉండగా, జ్యూరీ హెడ్‌ నాదవ్‌ లాపిడ్‌ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని 53 వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) జ్యూరీ బోర్డు సైతం నిర్ణయించింది. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని బోర్డు తెలిపింది.