మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘విద్యా దీవెన కాదు జగన్ రెడ్డి విద్యార్థులకు దగా దీవెన. టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం 11 లక్షల మందికి అందించి 5 లక్షల మంది విద్యార్థులకు విద్యా దీవెన కోత విధించింది. మోసకారి సంక్షేమం పేరుతో గోరంత ఇచ్చి కొండంత ప్రచారం. 2021-22లో 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో యాజమాన్యం విద్యార్థులను పరీక్షలు రాయనివ్వడం లేదు.
ఒక్క విద్యా దీవెనకే ఏడాదికి రూ.20 కోట్లు చొప్పున 5 ఏళ్లకు రూ.100 కోట్లు ఒక్క సాక్షి పేపర్‌కే ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. పీజీ విద్యార్థులకు విద్యాదీవెన నిలిపివేసి బడుగు బలహీన వర్గాలకు ఉన్నత చదువులు దూరం చేశారు. టీడీపీ అమలు చేసిన విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలు రద్దు చేసి విద్యార్థులకు ద్రోహం.’’ చేశారంటూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు అచ్చెన్నాయుడు.