ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త తెలిసి యావత్ భారతం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశానికి ఆయన చేసిన సేవలు ఈ తరమే కాదు.. వచ్చే తరతరాలు కూడా గుర్తుకుపెట్టుకుంటాయి. అలాంటి రతన్ టాటా ఇకలేరు అనే విషయాన్ని ఇప్పటికీ కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే రతన్ టాటా మీద ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి వినూత్న రీతిలో టాటాకు నివాళి అర్పించారు. అందుకోసం అతను పడిన శ్రమ అందరిచేత శభాష్ అనిపిస్తుంది. ఏకంగా 11వేల వజ్రాలతో టాటా చిత్రపటాన్ని గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారి విపుల్‌భాయ్ రూపొందించారు.ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్‌ను విపుల్ వినియోగించాడని సమాచారం.ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాటా మీద ఆయనకున్న అభిమానం పట్ల నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.