Breaking : నేడు ఆకాశంలో అద్భుతం దృశ్యం.. మీరూ వీక్షించండి..

-

అంతరిక్షంలో ఈ ఆదివారం రాత్రి అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. చంద్రుడు, శుక్రుడు, శని ఒకే వరుసలోకి రానున్నాయి. గత కొన్నిరోజులుగా శుక్ర గ్రహం, శని గ్రహం పరస్పరం సమీపానికి వచ్చాయి. నేడు (జనవరి 22) నాటికి 0.4 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి చేరువయ్యాయి. శుక్రుడు అత్యంత కాంతివంతమైన గ్రహం అని తెలిసిందే. ప్రస్తుతం శుక్రుడు -3.9 మాగ్నిట్యూడ్ తో కాంతులు విరజిమ్మనుండగా, శని గ్రహం -0.7 మాగ్నిట్యూడ్ తో మరింత మసకబారనున్నాడు.

 

ఇప్పుడీ రెండు మకరరాశిలోకి ప్రవేశించనున్నాయి. దీన్నే గ్రహ సంయోగంగా పిలుస్తారు. నేటి రాత్రి చంద్రుడికి సమీపంలోనే ఈ గ్రహ సంయోగం కనువిందు చేయనుంది. దీన్ని టెలిస్కోప్, బైనాక్యులర్స్ సాయంతో స్పష్టంగా వీక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఖగోళ ఘట్టాన్ని సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సన్ సెట్ పాయింట్ కు కొద్దిగా పైన వీక్షించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version