ఓపికతో 700 మందికి సెల్ఫీ ఇచ్చి సంచలనం సృష్టించిన యశ్..!!

-

ఒక స్టార్ తనను అభిమానించే వారికి సెల్ఫీలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా ఎగబడి వచ్చి ఇబ్బంది పెడితే మాత్రం వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోతారు. అలాగే తన బౌన్సర్స్ తో  అందరిని నెట్టిస్తారు. ఇక తప్పదు అనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు తో ఫోటో దిగుతారు. మరి కొంత మంది ఆగ్రహంతో అభిమానుల చెంప చెళ్లుమనిపించడం, లేక వాళ్ల ఫోన్ విసిరి కొట్టడం చేస్తారు.

కేజీఎఫ్ 2  తో దేశంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హీరో యశ్. ఈ సినిమా తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం  దీంతో యశ్ నెక్ట్స్ సినిమా  కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్యాన్స్. ఈ క్రమంలోనే ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో యశ్ పాల్గొన్న యశ్ అభిమానుల ఊహించని పని చేసి వారిని ఆనందంలో ముంచెత్తాడు.

ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్న యశ్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ముందుకు రాగా.. అందరూ కలిసి ఓకే ఫోటోగా.. గ్రూప్ పిక్ తీసుకోవాలని షో వారు చెప్పినా ఫ్యాన్స్ సెల్ఫీ కోసం రిక్వెస్ట్ చేశారు.దీంతో  అందరికీ సెల్ఫీ ఇచ్చేందుకు యశ్ ఒకే చెప్పారు. అలా 700 మందికి పైగా ఒక్కొక్కరికి విడి విడిగా సెల్ఫీలకు ఫోజులిచ్చారు. సెల్ఫీలు మొత్తం పూర్తి కావడానికి గంట నుండి రెండు గంటల  సమయం పట్టింది. సెల్ఫీ తీసుకున్న ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ రోజుల్లో ఇంత ఓపిక తో ఉండి అందరికీ సెల్ఫీ ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడని ప్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version