Sarkaru Vaari Paata: బార్సిలోనా లో “సర్కారు వారి ‘పాట‌'”.. అక్క‌డ ఏం చేస్తున్నారంటే?

-

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే.. మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్ తొలిసారి మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి వ‌చ్చే అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్ప‌డేప్పుడూ వ‌స్తున్నదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది.


తాజాగా ఈ చిత్రం గురించి మ‌రో అప్డేట్ వ‌చ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను బార్సిలోనాలో జ‌రుగుతుంద‌ట‌.. అందమైన లొకేషన్స్‌లో మహేష్, కీర్తి సురేష్ పైన డ్యూయట్స్‌ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ షూట్ చేసే లవ్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని ఆ చిత్ర‌ యూనిట్ చెబుతున్నారు. ఈ నెల చివరి వరకు స్పెయిన్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేయనున్నారట.. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారని తెలుస్తుంది.

బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సాగే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం బాణీలు స‌మ‌కుర్చుతున్నారు. ఆర్ మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండ‌గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వ‌హిస్తున్నారు. ఇక ఈ చిత్రం 2022లో సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version